![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -103 లో... అభి మాట్లాడిన మాటలకి రామలక్ష్మి ఏడుస్తూ గుడికి వస్తుంది. అక్కడ కూర్చొని బాధపడుతున్న రామలక్ష్మి దగ్గరకి సీతాకాంత్ వస్తాడు. ఇక అభి అన్న మాటలన్నీ సీతాకాంత్ కి చెప్తుంది రామలక్ష్మి. ఎందుకు అలా మాట్లాడాడో.. నేను అడుగుతాను పదా అని సీతాకాంత్ అనగానే.. వద్దు ఇక వాడు నాకు అవసరం లేదు.. నేనే వద్దనుకోని వచ్చాను. ఇకమీదట వాడి గురించి నా ముందు తియ్యకండి అని రామలక్ష్మి చెప్తుంది. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది.. వాడి నుండి నిన్ను కాపాడాను. ఇప్పుడు నీ కళ్ళలో నీళ్లు రాకుండా ఇక చూడాలని సీతాకాంత్ అనుకుంటాడు.
ఆ తర్వాత ఇద్దరు దేవుడికి మొక్కుకొని వస్తుంటే.. వాళ్ళ ఇంటి స్వామి ఎదరయ్యి కలవరపడకు.. అంత మంచికే జరిగింది.. ఇకనుండి నీ ప్రయాణం మొదలవుతుంది. నీ చెయ్యి ఎప్పుడు వదలని చెయ్యి నిన్ను పట్టుకోబోతుందని రామలక్ష్మికి స్వామి చెప్తాడు. రామలక్ష్మి చెయ్యి పట్టుకొని సీతాకాంత్ వెళ్తుంటే ఇక వాళ్ళు ఒకటి అయినట్లేనా అని స్వామి పక్కన అతను అడగుతాడు. గత జన్మ లో ఎన్నో యుద్ధాలు చేసారు. ఇప్పుడు అంత ఈజీగా ఎలా ఒకటవుతారు. అసలు సమస్యలు కూడా ఇక ఇప్పుడే మొదలు అవుతాయని స్వామి అంటాడు. మరొకవైపు రామలక్ష్మికి బాయ్ ఫ్రెండ్ ఉన్న విషయం చెప్పాలని శ్రీలత దగ్గరికి శ్రీవల్లి వెళ్తుంది. ఆ విషయం చెప్పగానే.. మాకు ఇదివరకే తెలుసని సందీప్ అంటాడు. దాంతో శ్రీవల్లి డిస్సపాయింట్ అవుతుంది. వాళ్ళు మాట్లాడుకున్నప్పుడే నాకు ఫోన్ చేస్తే.. వచ్చే వాళ్ళం కదా.. ఇప్పుడు వచ్చి చెప్తున్నావని శ్రీవల్లిపై శ్రీలత సీరియస్ అవుతుంది.
ఆ తర్వాత రామలక్ష్మి డల్ గా ఉందని సీతాకాంత్ తన పుట్టింటికి తీసుకొని వస్తాడు. ఇంత సడన్ గా ఎందుకు వచ్చారు.. ఏదయిన గొడవ జరిగిందా అని అందరు కంగారు మపడుతుంటే.. లేదు బెంగ పెట్టుకుంది. అందుకే తీసుకొని వచ్చానని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత అందరు కలిసి భోజనం చేస్తుంటే.. ఆకలిగా లేదంటూ రామలక్ష్మి తినకుండా వెళ్ళిపోతుంది. మా అక్క మారిపోయింది. రేపు నా బర్త్ డే అన్న విషయం కూడా మర్చిపోయావని రామలక్ష్మితో పింకీ అంటుంది. అదేం లేదని రామలక్ష్మి అనగానే అయితే ఈ రోజు ఉంటే రేపు విషెస్ చెప్పి వెళ్ళు అని పింకీ అంటుంది. మరొక వైపు అభి ఫ్రెండ్ ని శ్రీలత, సందీప్ ఇద్దరు కలుస్తారు. అభి గురించి అడుగుతారు. నాకు తెలియదు సీతా సర్ ఏదో చేసి ఉంటారని అతను అంటాడు. అవునని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |